ఆవును రక్షించబోయి విద్యుదాఘాతంతో వృద్దురాలు మృతి - old women
పొలంలో పశువులను మేపుతుండగా తెగిపడిన విద్యుత్ వైరు తగిలి ఆవు విద్యుదాఘాతానికి గురవ్వగా... దానిని రక్షించే క్రమంలో ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా కోడూరులో జరిగింది.
విద్యుదాఘాతం... వృద్ధురాలు, ఆవు మృతి
విశాఖ జిల్లా అనకాపల్లి కోడూరులో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో వృద్ధురాలుతో సహా ఆవు మృతి చెందింది. రాములమ్మ అనే వృద్ధురాలు పశువులను మేపుతుండగా తెగిపడిన విద్యుత్ వైరు ఆవుకు తగిలి విద్యుదాఘాతానికి గురైంది. ఆవును రక్షించే క్రమంలో మహిళ సైతం కరెంట్ షాకుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.