జీడి తోటల్లో వృద్దుడు అనుమానాస్పద మృతి - విశాఖపట్నం నేర వార్తలు
గొలుగొండ మండలం సీహెచ్ నాగాపురం జీడి తోటల్లో సుమారు 60 ఏళ్ల వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సోమరాజు మృతి పట్ల విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
విశాఖ జిల్లా గొలుగొండ మండలం సీహెచ్ నాగపురం జీడి తోటల్లో సుమారు 60 ఏళ్ల వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతను పాయకరావుపేటకు చెందిన సోమరాజుగా పోలీసులు గుర్తించారు. సుమారు 15 ఏళ్లుగా ఇదే ప్రాంతంలోని పలు గ్రామాల్లో జీడి తోటలను కౌలుకు తీసుకోని ఇక్కడే నివాసం ఉంటున్నారని స్థానికులు చెబుతున్నారు. అకస్మాత్తుగా సోమవారం సాయంత్రం సోమరాజు అదే జీడి తోటలో శవమై కనిపించడం పట్ల స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమరాజు మృతి పట్ల విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.