ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మన్యం విహార యాత్రలో వృద్ధుడికి పాముకాటు.. ఆసుపత్రిలో చికిత్స - విశాఖ జిల్లా వార్తలు

పర్యటక క్షేత్రమైన జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం వద్ద ఓ వృద్ధుడిని పాము కాటు వేసింది. అది గమనించిన కుటుంబీకులు ఆయనను జి.మోడల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నారు.

old-man-bitten-by-snake
విహార యాత్రలో వృద్ధుడికి పాముకాటు

By

Published : Dec 17, 2020, 9:30 PM IST

విశాఖ మన్యం పర్యటక కేంద్రానికి వచ్చిన ఓ వృద్ధుడు పాముకాటుకు గురై ఆసుపత్రి పాలయ్యారు. మహమ్మద్ అనే వృద్ధుడు కుటుంబ సమేతంగా పాడేరు ఏజెన్సీ జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతానికి వచ్చారు. అక్కడ నడుస్తుండగా ఆయనను పాము కాటు వేసింది. కుటుంబీకులు హుటాహుటిన జి.మోడల్ ఆసుపత్రికి తరలించారు. మహమ్మద్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. విహారంలో ప్రమాదం జరగటం వల్ల కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details