ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోస్తనీ నది బ్రిడ్జి పైనుంచి దూకి వృద్ధురాలు ఆత్మహత్య - old lady suicide latest news

కుటుంబ కలహాలతో ఓ వృద్ధురాలు గోస్తనీ నది బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన విశాఖ జిల్లా కొండపేటలో జరిగింది.

old lady committed suicide
వృద్ధురాలు గోస్తనీనది బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్య

By

Published : Mar 6, 2021, 7:59 AM IST

విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ పరిధిలోని కొండపేటలో అలంకవారి వీధిలో ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. అలంకవారి వీధికికి చెందిన డెబ్భై ఏడేళ్ల పి.అప్పలనర్సమ్మ కుటుంబ సభ్యులతో కలిసి ఉండేది. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడింది. ఈ క్రమంలోనే కుటుంబ కలహాలతో తరచూ గొడవలు జరుగుతుండేవి. గతంలో ఎప్పుడైనా గొడవలు జరిగితే.. అలిగి ఇంటి నుంచి వెళ్లి.. కొంత సమయం తరువాత అప్పలనర్సమ్మ యాథావిధిగా ఇంటికి వచ్చేసేది.

ఇదిలా ఉండగా.. శుక్రవారం కుటుంబ సభ్యులతో గొడవపడి అప్పలనర్సమ్మ ఇంటి నుంచి వెళ్లిపోయి.. గోస్తనీనది బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఎప్పటిలాగే ఇంటికి తిరిగి వస్తుందని అనుకుంటున్న కుటుంబ సభ్యులు.. అప్పలనర్సమ్మ ఆత్మహత్య చేసుకుందనే విషయం తెలియటంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న భీమిలి పోలీసులు.. మృతదేహాన్ని నది నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details