లాక్‌డౌన్ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఓ పరిశ్రమ యథావిధిగా పనులు కొనసాగిస్తోంది. విశాఖ జిల్లా రోలుగుంటలో 'ఓలమ్ ఆగ్రో' అనే జీడి పిక్కల కర్మాగారాన్ని మూసివేయకుండానే కార్మికులతో.. యాజమాన్యం పనులు చేయిస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానిక సచివాలయ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, నాయకులు, యువకులు, గ్రామ వాలంటీర్లు వెళ్లి.. యాజమాన్యాన్ని ప్రశ్నించారు. పరిశ్రమలోకి వెళ్లి.. అక్కడ పని చేస్తున్న మహిళా కార్మికులను ఇళ్లకు పంపించేశారు. మూసివేయకపోతే అధికారులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
'ఏం బాబూ.. లాక్‌డౌన్ పట్టదా మీకు?' - విశాఖలో లాక్‌డౌన్ వార్తలు
లాక్‌డౌన్ కారణంగా పరిశ్రమలను మూసివేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను కొన్ని సంస్థలు పెడచెవిన పెడుతున్నాయి. యథావిధిగా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన సచివాయల సిబ్బంది... యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Olam Agro ndustry do not follow lockdown at rolugunta in visakhapatnam