విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటలపై ఎక్సైజ్ అధికారులు, పోలీసులు దాడులు నిర్వహించారు. పాడేరు మండలం ఇరడాపల్లి పంచాయతీ బొడ్డపుట్టుకొండల్లో 35 ఎకరాల్లో 1.7 లక్షల మొక్కలు తగలబెట్టారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు... ఒక్కసారిగా తోటలపై దాడులు చేశారు. గంజాయి సాగుదారుల్లో అలజడి నెలకొంది. గంజాయి సాగుచేస్తే సహించబోమని ఎక్సైజ్, పోలీసులు హెచ్చరిస్తున్నారు. మన్యంలో గంజాయి తోటలను గుర్తించి, ధ్వంసం చేయనున్నట్టు అధికారులు తెలిపారు.
గంజాయి సాగుపై ఎక్సైజ్ అధికారుల నజర్..! - offocers attack on Illegal Cannabis cultivation news
గంజాయి సాగు చేస్తున్న తోటలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. విశాఖ ఏజెన్సీలో 35 ఎకరాల్లో 1.7 లక్షల మొక్కలు తగలబెట్టారు. నిషేధిత గంజాయి సాగుచేస్తే సహించబోమని ఎక్సైజ్ అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అక్రమ గంజాయి సాగు