విశాఖ జిల్లా సబ్బవరంలో కరోనా బాధితుల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కరోనా సోకిన వారిని కరోనా కేంద్రాలకు తరలించడంలోనూ జాప్యం వహిస్తున్నారు. తాజాగా సబ్బవరం ప్రాథమిక ఆస్పత్రిలో గర్భిణీకి కరోనా సోకిందని తెలింది. ఆమెను కరోనా కేంద్రానికి తరలించడానికి అధికారులు నిర్లక్ష్యం వహించారు.
గర్భిణీకి కరోనా... తరలించడంలో అధికారుల అలసత్వం - సబ్బవరంలో కరోనా
విశాఖ జిల్లా సబ్బవరంలో కరోనా సోకిన గర్భిణీ పట్ల అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఆమెను కరోనా కేంద్రానికి తరలించడంలో అలసత్వం చూపారు.
గర్భిణీ స్త్రీకి కరోనా.. అధికారులు నిర్లక్ష్యం
కరోనా నిర్ధరణై గంటలు గడిచినా.. గర్భిణీని కరోనా కేంద్రానికి తీసుకువెళ్లలేదు. కరోనా ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి వాహనం లేదని కారణం చెప్పారు. చివరికి కుటుంబ సభ్యులు పలు సార్లు ఫోన్లు చేసి మాట్లాడగా.. విశాఖ ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
ఇదీ చదవండి: గవర్నర్ ఆదేశాలిచ్చినా పోస్టింగ్ ఇవ్వకపోవటం దారుణం:సుప్రీం