విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాం వద్ద ఉన్న పాలవెల్లి మధ్య తరహా జలాశయం నిర్వహణను అధికారులు పట్టించుకోవటం లేదు. దీంతో జలాశయం ప్రధాన వరద గట్టు, రహదారి, ట్రాన్స్ ఫార్మర్, అతిథి గృహం వద్ద చెట్లు దట్టంగా పెరిగి చిన్నపాటి అడవిలా కనిపిస్తోంది. తుప్పలతో జలాశయ ప్రాంతం అంతా అధ్వానంగా మారింది. ప్రధాన గట్టుపై తుప్పలు దట్టంగా పెరగటంతో ప్రమాదకరంగా ఉంది. జలాశయం గర్భంలో సైతం తుప్పలు పెరుగుతున్నాయి. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తుప్పలను తొలగించాలని రైతులు, సందర్శకులు కోరుతున్నారు.
పాలవెల్లి సమీపంలో పెరిగిన తుప్పలు.. పట్టించుకోని అధికారులు
విశాఖపట్నం జిల్లా కోనాం వద్ద ఉన్న మధ్యతరహా జలాశయం నిర్వహణను అధికారులు గాలికొదిలేశారు. జలాశయం ప్రధాన గట్టు, మార్గం తుప్పలతో అధ్వానంగా ఉంది. అధికారులు స్పందించి పిచ్చి మెుక్కలను తొలగించాలని రైతులు సందర్శకులు కోరుతున్నారు.
అధ్వాన్నంగా పాలవెల్లి జలాశయం