విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు లెక్కించారు. నేడు కొండపైన ఉన్న 16 హుండీలను లెక్కించారు. మిగతా హుండీని మరో రెండు మూడు రోజుల్లో లెక్కిస్తామన్నారు. నేటి లెక్కింపులో స్వామి వారి హుండీ ఆదాయం రూ.1,42,97,206 వచ్చినట్లు ఆలయ ఈవో సూర్యకళ తెలిపారు. రానున్న రోజుల్లో మరింత ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు
రికార్డు స్థాయిలో సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం - Simhadri Appanna temple news
సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు లెక్కించారు. రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిందన్న ఆలయ అధికారులు...కొవిడ్ నిబంధనలు సడలించటంతో భక్తుల రాక పెరిగినట్లు తెలిపారు.
అప్పన్న హుండీ ఆదాయం లెక్కింపు
కొవిడ్ నిబంధనలు సడలించటంతో భక్తుల రాక పెరిగినట్లు అధికారులు తెలిపారు. నిత్యాన్నదానానికి భక్తులు లక్షలాది రూపాయలు కానుకగా సమర్పిస్తున్నారని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి