విశాఖ జిల్లాలో కరోనా కలవరపెడుతోంది. ముఖ్యంగా నర్సీపట్నం నియోజకవర్గంలో పాజిటివ్ కేసులు అధికమయ్యాయి. కొత్తగా మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. బాధితుల్ని విశాఖలోని కొవిడ్ ఆసుపత్రులకు తరలించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అవసరమైన రక్షణ చర్యలు చేపడుతున్నారు. కంటైన్మెంట్ జోన్లలో రసాయనాల పిచికారి, బ్లీచింగ్ వెదజల్లడం వంటివి చేస్తున్నారు.
కరోనా కేసుల కలవరం... అధికారులు అప్రమత్తం - నర్సీపట్నంలో కరోనా వార్తలు
కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. నర్సీపట్నం నియోజకవర్గంలో కొత్తగా మరో నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు అప్రమత్తమైన అధికారులు రక్షణ చర్యలు చేపడుతున్నారు.

కరోనా కేసులు కలవరం... అధికారులు అప్రమత్తం