విశాఖ నగరంలో అమ్మోనియం నైట్రేట్ నిల్వలను అధికార బృందం పరిశీలించింది. జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ ఆదేశాల మేరకు
ఆర్డీవో కె.పెంచల కిషోర్, కాలుష్య నియంత్రణ మండలి ఈ సుభాన్, ఇనస్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శంకర్ రెడ్డి గిడ్డంగిని పరిశీలించారు.
మిందిలో అమ్మోనియం నైట్రేట్ ఫెసిలిటేటర్ శ్రావణ్ షిప్పింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ గిడ్డంగిలో 18,500 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వవుంది. విదేశాల నుండి దిగుమతి చేసుకున్న రసాయన లవణాన్ని గిడ్డంగిలో నిల్వ వుంచి సంబంధిత ఏజెన్సీలకు అందజేస్తారు. అటువంటి ఏజెన్సీలు ఆంధ్ర ప్రదేశ్ లో లేవు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు నేరుగా విదేశాలకు ఆర్డర్లు చేసుకుంటారని, వారు దానిని నెలరోజుల లోగా తీసుకు వెళ్ళ వలసి వుంటుంది. సుమారు 270 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటిన ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఈ లవణం మండుతుందని అధికారులు తెలిపారు. గోడౌన్ ను పరిశీలించిన అధికారులు ఇతర సాంకేతిక అంశాలను బేరీజు వేశారు. విశాఖ నగరానికి అమ్మోనియం నైట్రేట్ ముప్పు పై ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ఈ బృందం పరిశీలన ప్రాధాన్యం సంతరించుకుంది. విపత్తు నిర్వహణ శాఖ ద్వారా మరింత లోతుగా పరీక్షలు చేయించి అగ్ని మాపక అధికారుల ద్వారా ముందస్తు ప్రమాద నివారణ చర్యలు మరింత పక్కాగా అమలు చేయాలని ఈ బృందం సూచించింది.
విశాఖలో అమ్మోనియం నైట్రేట్ నిల్వలను పరిశీలించిన అధికారులు - విశాఖలో అమ్మోనియం నైట్రేట్ నిల్వల వార్తలు
విశాఖ నగరంలో అమ్మోనియం నైట్రేట్ నిల్వలను అధికార బృందం పరిశీలించింది. మిందిలో అమ్మోనియం నైట్రేట్ ఫెసిలిటేటర్ శ్రావణ్ షిప్పింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ గిడ్డంగిలో 18,500 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వవుంది. విశాఖ నగరానికి అమ్మోనియం నైట్రేట్ ముప్పు పై ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ఈ బృందం పరిశీలన ప్రాధాన్యం సంతరించుకుంది.
offices visit nitrate gowdown
ఇదీ చదవండి:కేరళలో ఘోర విమాన ప్రమాదం.. 19 మంది మృతి
TAGGED:
విశాఖలో అమ్మోనియం నైట్రేట్