విశాఖ జిల్లా జి మాడుగుల, రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ సరిహద్దులోని ఓ కుగ్రామం అధికారుల రికార్డులో లేకపోవటంతో.. అక్కడి ప్రజలకు ఆధార్ కార్డులు లేవు. దీంతో ప్రజలు ప్రభుత్వ పథకాలు, పిల్లలు చదువుకు దూరం అయ్యారు. ఏలా అయినా చదువుకోవాలనే కోరికతో గిరిజన చిన్నారులు నిరసన బాట పట్టారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమంలో హల్చల్ కావటంతో.. అధికారులు గుర్తించి వారి సమస్యలను పరిష్కరించటానికి ముందుకు వచ్చారు.
గిరిజన శాఖ మంత్రి పుష్పశ్రీవాణి వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలంటూ ఐటీడీఏ పీవోను ఆదేశించారు. రంగంలో దిగిన జి.మాడుగుల ఎంపీడీవో వెంకన్న బాబు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ ఆదేశాలతో జి.మాడుగుల ఎండీ ఓ వెంకన్నబాబు డిప్యూటీ తహసీల్దార్ అప్పలస్వామితో కలిసి కొండలు, సెలయేరు గుండా నడిచి వెళ్లి ఆ గ్రామాన్ని సందర్శించారు అక్కడ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆధార్, ఓటర్, రేషన్, జాబు కార్డులతో పాటు అంగన్వాడి సెంటర్, ఆశా కార్యకర్తను ఇవ్వడానికి ఎండిఓ వెంకన్నబాబు రంగం సిద్ధం చేశారు. విద్యుత్తు సమస్య ఉందని.. సోలార్ ప్లాంట్ మరమ్మతులు చేస్తామన్నారు.