విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీకి అధికారులు సిద్దమవుతున్నారు. దాదాపు 12,500 మందిని అర్హులుగా గుర్తించిన అధికారులు అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో రెవెన్యూ సిబ్బంది అదివారం తీరిక లేకుండా పట్టాలు సిద్ధం చేశారు. గొలుగొండ, రోలుగుంట, నర్సీపట్నం, మాకవరపాలెం, నాతవరం తదితర మండలాల్లో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్వో, ఇతర సిబ్బంది పట్టాల పంపిణీకి సన్నాహాలు చేస్తున్నారు.
ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్న అధికారులు - visakhapatnam latest news update
ఎనిమిదో తేదీన ప్రభుత్వం పంపిణీ చేయనున్న ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఆదివారం రెవెన్యూ సిబ్బంది తీరిక లేకుండా పని చేశారు.
ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్న అధికారులు