ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిర్లక్ష్యం నీడలో.. మరుగున పడుతున్న మన్యం అందాలు

సహజ సిద్దమైన అందాలతో పర్యాటక ప్రేమికులను ఎప్పడూ.. రా రమ్మంటు పిలిచేందుకు పాడేరు అందాలు ముందుంటాయి. కనువిందు చేసే కొండ కోనలు.. జాలువారే జలపాతాలు.. హోయలొలుకుతూ.. హాయిని పంచే.. పచ్చదనం పాడేరు సొంతం. అలాంటి చోట అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం.. పర్యాటకాన్ని వెనుకడుగు వేయిస్తోంది. విశాఖ ఏజెన్సీలో పర్యాటక ప్రాంతామైన మత్స్యగుండం.. ఆదరణ లేక కొన్ని రోజులుగా.. కళాహీనమైపోయింది.

officers negligence on visakha agency
నిర్లక్ష్యానికి గురవుతున్న మన్యం

By

Published : Mar 19, 2021, 3:35 PM IST

విశాఖ జిల్లా పాడేరు మన్యం అందాలకు.. ప్రకృతి రమణీయతకు.. పెట్టింది పేరు. కొండకోనల నడుమ జాలువారే జలపాతాలు ఇట్టే ఆకర్షిస్తాయి. సమయం చిక్కితే చాలు.. పర్యాటక ప్రేమికులు వీటిని తనివితీరా ఆస్వాదిస్తుంటారు. అలాంటి పర్యాటక ప్రాంతాలను అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. అందుకు హుకుంపేట మండలం మత్స్యగుండం మంచి ఉదాహరణగా నిలుస్తోంది.

మదిని దోచే మత్స్యగుండం అందాలు..

పర్యాటక శాఖ 2004లోనే మత్స్యగుండాన్ని తన అధీనంలోకి తీసుకుంది. అప్పటి ప్రభుత్వం కోటి రూపాయలు వెచ్చించి సుందరవనంగా తీర్చిదిద్దింది. కాలక్రమేణా అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం కారణంగా.. దీని బాగోగులు పట్టించుకోవడం మానేశారు. ఇక్కడ అందమైన వనాలు, మత్స్యాలు, సర్పాలు మధ్య వెలసిన మత్స్యలింగేశ్వర స్వామి దేవాలయం, నాగ దేవత ఆలయాలు కళాహీనమయ్యాయి. బండరాళ్ల మధ్య ప్రవహించే కొండవాగు ప్రత్యేక అందాన్ని సంతరించుకుంటుంది. ఇంతటి అద్భుత పర్యాటక శోభను తనలో ఇముడ్చుకున్న ప్రాంతం.. నిర్లక్ష్యానికి గురై.. పర్యాటకుల రాకపోకలు తగ్గుముఖం పట్టాయి. పర్యాటక శాఖ శీతకన్ను కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందని స్థానికులు చెబుతున్నారు.

మరుగున పడిన మన్యం వనాలను తీర్చిదిద్దాలి..

పాడేరుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పర్యాటక వనాన్ని.. స్థానికులు చందాలు వేసుకొని శివరాత్రి మహోత్సవాలప్పుడు మాత్రమే శుభ్రం చేస్తూ.. కొంతకాలమే పట్టించుకుంటున్నారు. నిధుల కొరత కారణంగానే ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయలేకపోతున్నట్లు అక్కడి ప్రజలు వెల్లడిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరుగున పడిన సహజ సిద్ధమైన మన్యం వనాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చి దిద్దాలను కోరుతున్నారు.

ఇవీ చూడండి..

'తొట్లకొండపై సినిమా క్లబ్​ నిర్మాణం సరికాదు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details