విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం వెంకటరాజుపురంలో గొర్రెలు, మేకలు 68 వరకు వింత వ్యాధితో మృతి చెందాయి. గొర్రెలు, మేకలు పెంపకందారులు దేవరాపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. వ్యాధులతో గొర్రెలు, మేకలు మృత్యువాత ,పరిహారం చెల్లించాలని గొర్రెల పెంపకందారుల ఆందోళన పేరుతోఈటీవీ భారత్లో కథనాలు ప్రసారమయ్యాయి. స్పందించిన దేవరాపల్లి పశు వైద్య సిబ్బంది వ్యాధితో పడుతున్న గొర్రెలు, మేకలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మందులు ఉచితంగా అందించారు. జీవాలు పెంపకంపై అవగాహన కల్పించారు.
ఈటీవీ భారత్ ఎఫెక్ట్: వెంకటరాజుపురంలో గొర్రెలు, మేకలకు వైద్య పరీక్షలు - Visakhapatnam District Devarapally Latest News
ఈటీవీ - ఈటీవీ భారత్ కథనాలకు పశు వైద్య శాఖ అధికారులు స్పందించి వెంకటరాజుపురంలో గొర్రెలు, మేకలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మందులను ఉచితంగా అందించారు.
ఈటీవీ భారత్ ఎఫెక్ట్: వెంకటరాజుపురంలో గొర్రెలు, మేకలకు వైద్య పరీక్షలు
ఇవీ చదవండి