ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వ్యాపారులూ.. కరోనా నియంత్రణ చర్యలకు సహకరించండి' - corona cases in narsipatnam latest news update

కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా నర్సీపట్నం లోని వాణిజ్య, వ్యాపారాలపై అధికారులు ఆంక్షలు విధించారు. చుట్టు పక్క ప్రాంతాల వారు నిత్యావసర పనులకు నగరంపై ఆధారపడి ఉండడం వాణిజ్య పరంగా కొంత ఇబ్బంది అవుతున్నప్పటికీ కరోనా నియంత్రణలోకి వచ్చేెంతవరకు సహకరించాలని కోరారు.

officers Conditions of the authorities for business people
వ్యాపారులకు అధికారుల షరతులు

By

Published : Jul 15, 2020, 7:07 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం పురపాలక పరిధితో పాటు పరిసర ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు అధికమవుతున్న కారణంగా.. అధికారులు అప్రమత్తమయ్యారు. ఇందుకు సంబంధించి నర్సీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారిణి లక్ష్మీ శివజ్యోతితో పాటు మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, నర్సీపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వామి నాయుడు తదితరులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

దుకాణాల సముదాయాలకు సంబంధించి సమయాలను వివరించారు. వ్యాపారులంతా సహకరించాలని అధికారులు కోరారు. కరోనా పాజిటివ్ కేసులు అదుపులోకి వచ్చే వరకు వ్యాపారులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే దుకాణాలు తెరిచేందుకు వ్యాపారులు అంగీకరించారు.

ABOUT THE AUTHOR

...view details