విశాఖపట్నం జిల్లా నియోజకవర్గ కేంద్రం మాడుగుల పంచాయతీ పారిశుద్ధ్య నిర్వహణ అధికారి అల్లం వెంకటరమణ (50) ఆత్మహత్యకు పాల్పడ్డారు. కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని, తాగి సంఘటన స్థలంలోనే అపస్మారక స్థితికి చేరుకున్నారు. గమనించిన స్థానికులు ఆయనను మాడుగుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు పంచాయతీ సిబ్బంది చెబుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పురుగుల మందు తాగి అధికారి ఆత్మహత్య - today visakhapatnam crime latest news
విశాఖపట్నం జిల్లా మాడుగులలో పంచాయతీ పారిశుద్ధ్య నిర్వహణ అధికారి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పంచాయతీ సిబ్బంది వాపోతున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![పురుగుల మందు తాగి అధికారి ఆత్మహత్య Officer commits suicide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8128724-444-8128724-1595424745705.jpg)
పురుగుల మందు తాగి అధికారి ఆత్మహత్య
ఇవీ చూడండి...