Maoist Dump seized: ఆంధ్ర - ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన మరో భారీ డంప్‌ను ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో పేలుడు పదర్థాలతో కూడిన డంప్‌ను స్వాధీనం చేసుకోవటం ఇది మూడోసారి. కచ్ఛితమైన సమాచారం ఆధారంగా డీవీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలు జంత్రి పంచాయతీ పరిధిలోని మర్రివాడ, నడిమెంజరీ గ్రామల సరిహద్దుల్లోని అటవీప్రాంతంలో డంపును స్వాధీనం చేసుకున్నారు. ఐఈడీ బాంబులతో సహా పెద్ద ఎత్తున పేలుడు సామగ్రి పట్టుబడినట్లు మల్కాన్ గిరి పోలీసులు వెల్లడించారు.
Maoist Dump: ఏవోబీలో మావోయిస్టుల డంప్ స్వాధీనం
Maoist Dump: ఆంధ్ర- ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన మరో భారీ డంప్‌ను ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐఈడీ బాంబులతో సహా పెద్ద ఎత్తున పేలుడు సామగ్రి పట్టుబడినట్లు మల్కాన్ గిరి పోలీసులు వెల్లడించారు.
ఏవోబీలో మావోయిస్టుల డంప్ స్వాధీనం
ఇందులో నాలుగు ఐఈడీ టిఫిన్ బాంబులు, 20 వెబ్ బెల్ట్‌లు, 20 టోపీలు, 20 విజిల్స్‌తో పాటు మందులు ఇతర సామాగ్రి, మావోయిస్టు విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాలు తయారు చేసేందుకు..,మరమ్మతులు చేసుకునేందుకు ఈ డంప్‌ను మావోయిస్టులు ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి : సీడీఎస్ రావత్ చాపర్ క్రాష్‌కు కారణం ఇదే.. వాయుసేనకు కీలక నివేదిక!