ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పన్న ఆలయంలో నిత్యాన్నదానానికి రూ. 2 లక్షల విరాళం - donation for Annadana scheme in Visakha Simhachalam temple

విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో నిన్న భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. స్వామివారి నిత్య అన్నదాన పథకానికి ఒడిశాకు చెందిన ఓ భక్తుడు 2,00,000 విరాళం అందించాడు.

Simhadri Appanna
సింహాద్రి అప్పన్న

By

Published : Jul 11, 2021, 11:11 AM IST

విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్నని నిన్న అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా టోల్ గేట్ వద్ద స్వామివారి దర్శనం టికెట్లు ప్రారంభించారు. శని ఆదివారాల్లో ఈ ఆలయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని ఆలయ అధికారులు చెప్పారు. స్వామివారి నిత్య కల్యాణం వైభవంగా నిర్వహించారు. అలాగే అమావాస్య కావడంతో ఆలయ ప్రధానార్చకులు గోపాలక్రిష్ణమచార్యులు అమావాస్య పూజలు చేశారు. ఒడిశాకు చెందిన భక్తుడు స్వామి నిత్యాన్నదాన పథకానికి రెండు లక్షల విరాళం ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details