ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో నర్సింగ్ సిబ్బంది ఆందోళన - vishakapatnam latest news

నర్సింగ్ సిబ్బంది.. విశాఖలో ఆందోళన చేపట్టారు. నాలుగు నెలలుగా కొవిడ్ విధులు నిర్వహిస్తున్న తమను హఠాత్తుగా తొలగించిన కారణంగా వీధిన పడ్డామంటూ నిరసన చేపట్టారు.

విశాఖలో ఆందోళన చేపట్టిన నర్సింగ్ సిబ్బంది
విశాఖలో ఆందోళన చేపట్టిన నర్సింగ్ సిబ్బంది

By

Published : Nov 28, 2020, 8:48 PM IST

ఉద్యోగ భద్రత కల్పించాలంటూ విశాఖ కలెక్టరేట్‌ ఎదుట నర్సింగ్‌ సిబ్బంది ఆందోళన చేశారు. కరోనా సమయంలో సేవలందించేందుకు గానూ ఆంధ్ర వైద్య కళాశాల..... 500 మంది బీఎస్సీ పూర్తిచేసిన వారిని నియమించింది. ఆరు నెలల పాటు సేవలందించేలా... ప్రభుత్వం తరఫున ఉత్తర్వులు ఇచ్చారు.

ఐతే విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ఉన్న ఫళంగా తొలగిస్తున్నట్టు ఆంధ్ర వైద్య కళాశాల హఠాత్తుగా ప్రకటించింది. పని చేసిన 4 నెలల కాలానికి జీతాలు సైతం ఇవ్వలేదని సిబ్బంది వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమ బకాయి జీతాలు చెల్లించాలని.... ఆరు నెలల పాటు కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details