విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణంలో కొత్తగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 83 మందికి కరోనా సోకింది. వీరిలో 32 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో 8 మందికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయి. అనకాపల్లిలో ఇప్పటికే 11 కంటెన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో కరోనా ఎక్కవగా ఉంది. అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో రోజుకో 150 నుంచి 200 వరకు ట్రూ నాట్ పరీక్షలు చేస్తున్నారు. కరోనా బాధితుల సంఖ్య అనకాపల్లిలో పెరుగుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, అధికారులు సూచిస్తున్నారు.
అనకాపల్లిలో 83కు చేరిన కరోనా కేసుల సంఖ్య - Number of corona cases reaching 83 in Anakapalli
విశాఖ జిల్లా అనకాపల్లిలో కరోనా రోజురోజుకీ వ్యాపిస్తోంది. ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఒకే రోజు ఆరు కేసులు నిర్ధారణ అయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 83కు చేరింది.
అనకాపల్లిలో 83కు చేరిన కరోనా కేసులు సంఖ్య