విశాఖ జిల్లా అనకాపల్లిలో నూకాలమ్మ అమ్మవారి జాతర ఈనెల 22న ప్రారంభంకానుంది. అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న కారణంగా.. ప్రజాప్రతినిధులు దూరంగా ఉంటున్నారు. జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై ఆర్టీవో సీతారామారావు సమక్షంలో అన్ని శాఖల అధికారులు సమావేశమయ్యారు. కరోనా విస్తృతి భయాందోళనల నేపథ్యంలో.. భక్తులను ఆలయంలోకి పరిమితంగా పంపాలని నిర్ణయించారు. భక్తులు మాస్కులు ధరించి రావాలని ప్రచారం చేస్తున్నారు. తాము తీసుకునే చర్యలకు సహకరించాలని కోరారు.
అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారి జాతరకు ఏర్పాట్లు - అనకాపల్లి నూకాలమ్మ జాతర తాజా న్యూస్
ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారి జాతర ఈనెల 22న ప్రారంభంకానుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో.. అధికారుల సమక్షంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు కోవిడ్ - 19 (కరోనా వైరస్) నేపథ్యంలో జాతరకు వచ్చే భక్తులు మాస్కులు ధరించి రావాలంటూ ప్రచారం చేస్తున్నారు.
జాతర ఏర్పాట్లను వివరిస్తున్న దేవాదాయ శాఖ సహాయ కమిషనర్