విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో నూకాలమ్మ జాతర వేడుకలు ఘనంగా జరిగాయి. నక్కపల్లి, యస్. రాయవరం, పాయకరావుపేట మండలాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు.
గోకులపాడు గ్రామంలో ప్రసిద్ధి చెందిన నూకాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు స్థానిక జూనియర్ ఎన్టీఆర్ యూత్ సభ్యులు సౌకర్యాలు కల్పించారు.