అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారి కొత్త అమావాస్య జాతర ఈనెల 22వ తేదీన ప్రారంభం కానుంది. కరోనా కారణంగా జాతరను రద్దు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ జాతరకు ప్రతిఏటా భక్తులు భారీ సంఖ్యలో వస్తారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకునే చర్యల్లో భాగంగా జాతర, భక్తులకు దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. కొత్త అమావాస్య జాతర నిలిపివేయడం ఇదే తొలిసారి. భక్తులకు కొంత నిరాశ కలిగినా ప్రజారోగ్య సంరక్షణ చర్యల్లో ఇది తప్పడం లేదని, సహకరించాలని దేవాదాయ శాఖ అధికారులు కోరుతున్నారు.
కరోనా కారణంగా నూకాలమ్మ జాతర నిలిపివేత - undefined
కరోనా ప్రబలుతున్న కారణంగా విశాఖ జిల్లా అనకాపల్లి నూకాలమ్మ జాతర నిలిపివేస్తున్నట్లు దేవాదాయ శాఖ తెలిపింది. ఈ నెల 31 వరకు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో దర్శనం నిలిపివేయాలన్న దేవాదాయ శాఖ ఉత్తర్వుల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు.
కరోనా కారణంగా నూకాలమ్మ జాతర నిలిపివేత