..
అనకాపల్లి నూకాలమ్మ కొత్త అమావాస్య జాతర ఏర్పాట్లు పూర్తి - nukalamma jatara
విశాఖ జిల్లా అనకాపల్లి నూకాలమ్మ కొత్త అమావాస్య జాతరను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్డీవో సీతారామారావు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో అన్ని శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఈ ఏడాది అధికారుల ఆధ్వర్యంలోనే కొత్త అమావాస్య జాతర జరగనుంది. కరోన వైరస్ ప్రబలుతున్నందున పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్డీవో అధికారులకు సూచించారు. మార్చి 22వ తేదీ జాతర ప్రారంభం కాగా... 23వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు ప్రత్యేక పూజలు నిమిత్తం కొవెలను మూసివేస్తారు. 24వ తేదీ ఉదయం ఐదు గంటలకు తెరుస్తారు. జాతరలో భాగంగా ఘటాల ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణ పురవీధుల్లో ఘటాలను ఊరేగించనున్నారు.
అనకాపల్లి నూకాలమ్మ