ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ విశాఖలో పర్యటించారు. ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన అనతరం ఆయన తొలిసారిగా విశాఖకు వచ్చారు. కేజీహెచ్, ఆంధ్ర మెడికల్ కాలేజీలతో అనుబంధం ఉన్న శ్యామ్‌ప్రసాద్‌ను మెడికల్ కాలేజీ, కేజీహెచ్ వైద్యాధికారులు సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మెడికల్ కళాశాలను పరిశీలించారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థుల హాజరు మెరుగుపరచటంపై దృష్టి పెట్టినట్లు వీసీ శ్యామ్‌ప్రసాద్ స్పష్టం చేశారు. పరిశోధకుల సంఖ్య పెరిగిందని... అందుకు అనుగుణంగా అధ్యాపకులు, సిబ్బంది, వనరులు సమకూర్చినట్లు వివరించారు.
విశాఖలో పర్యటించిన ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం వీసీ - ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయం తాజా వార్తలు
ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ విశాఖలో పర్యటించారు. కేజీహెచ్, ఆంధ్ర మెడికల్ కాలేజీలతో అనుబంధం ఉన్న శ్యామ్‌ప్రసాద్‌ను... మెడికల్ కాలేజీ, కేజీహెచ్ వైద్యాధికారులు సంయుక్తంగా సత్కరించారు.
ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయం ఉపకులపతి