ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి - ఎన్టీఆర్ జయంతి తాజా వార్తలు

విశాఖ జిల్లా వ్యాప్తంగా నందమూరి తారక రామారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. పలువురు నాయకులు.. ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తుచేసున్నారు.

NTR Jayanti celebrations
ఎన్టీఆర్ జయంతి వేడుకలు

By

Published : May 28, 2021, 1:17 PM IST

Updated : May 28, 2021, 6:55 PM IST

విశాఖ జిల్లా చోడవరంలో ఎన్టీఆర్ జయంతిని తెదేపా నాయకులు ఘనంగా జరిపారు. గోవాడ చక్కెర కర్మాగారం మాజీ ఛైర్మన్ గూనూరు మల్లునాయుడు సారథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. త్వరలోనే రాష్ట్ర ప్రజలు మంచి రోజులు రానున్నాయని వక్తలు పేర్కొన్నారు.

పాడేరులో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా.. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.. ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పూల మాలలు వేసి.. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

నర్సీపట్నంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు నందమూరి తారక రామారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మలివిడత కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నందువల్ల పరిమితంగా నాయకులు హాజరై.. వేరువేరుగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాల్సిన అవసరం ఉందని తెదేపా పట్టణ అధ్యక్షులు గవిరెడ్డి వెంకటరమణ పిలుపునిచ్చారు. అనంతరం కార్యకర్తలకు మిఠాయిలు పంచారు.

విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని మాడుగుల, చీడికాడ, కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లోని తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రం మాడుగులలో జరిగిన జయంతి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ తెదేపా ఇన్​ఛార్జ్ గవిరెడ్డి రామానాయుడు హాజరై.. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

విశాఖ జిల్లా అనకాపల్లిలో ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకుని ప్రధాన రహదారిలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వర రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ సేవలను కొనియాడారు.

ఇవీ చూడండి...:కొవిడ్ నిబంధనలు ఉల్లంఘన.. 25,108 మందిపై కేసులు

Last Updated : May 28, 2021, 6:55 PM IST

ABOUT THE AUTHOR

...view details