విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో కరోనా పరీక్ష గత నాలుగు రోజులుగా నిలిచిపోయాయి. అనకాపల్లితో పాటు చుట్టు పక్కల పరిసర ప్రాంతాలకు చెందిన 80 మందికి కిట్ ద్వారా పరీక్ష చేసి కరోనా నిర్ధరించాల్సి ఉంది. కిట్లు లేక పరీక్షలు జరగడం లేదు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్ని వివరణ కోరగా... శనివారం నుంచి పరీక్షలు చేస్తామని తెలిపారు. ఇప్పటివరకు 147 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. 73 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన వారిని క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు.
ఎన్టీఆర్ ఆసుపత్రిలో గత నాలుగు రోజులుగా నిలిచిన కరోనా పరీక్షలు - anakapalle latest news
గత నాలుగు రోజులుగా అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిలిచిపోయాయి. ట్రూనాట్ పరీక్ష చేసేందుకు కావలసిన కిట్ సరఫరా లేకపోవడం వల్ల పరీక్షలు నిలిపివేశారు. దీంతో అక్కడ పరీక్షలు జరగవలసిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
![ఎన్టీఆర్ ఆసుపత్రిలో గత నాలుగు రోజులుగా నిలిచిన కరోనా పరీక్షలు ntr hospial in anakapalle not doing corona test from past four days](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8064855-1016-8064855-1594998467430.jpg)
అనకాపల్లిలో నిలిచిన కరోనా పరీక్షలు