వైద్య విద్యాప్రమాణాలను పెంచేందుకు తన వంతు కృషి చేస్తానని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నూతన ఉపకులపతి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ వెల్లడించారు. వైద్య విద్యను అభ్యసించే విద్యార్ధులకు కమ్యూనికేషన్, సమయపాలన వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. వైద్య కళాశాలలకు ర్యాంకులు ఇచ్చేందుకు కేంద్రం అలోచిస్తోందని... ఇందులో ఎన్టీఆర్ యూనివర్సిటీ మంచి ర్యాంకులు వచ్చేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై ప్రత్యేకంగా కసరత్తు చేస్తానని వీసీ తెలిపారు.
'వైద్య విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తా'
ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి కొత్త వీసీగా నియామకపు ఉత్తర్వులు వెలువడిన తర్వాత ఈటీవీ భారత్తో నూతన ఉపకులపతి శ్యామ్ ప్రసాద్ తన ఆలోచనలను ఈటీవీ భారత్తో పంచుకున్నారు.
'వైద్య విద్యాప్రమాణాలను పెంచేందుకు నా వంతు కృషి చేస్తా'