ఆంధ్రప్రదేశ్

andhra pradesh

డ్రైవింగ్​లో శిక్షణ.. నిరుద్యోగులకు ఆసరా

By

Published : Feb 7, 2020, 8:26 PM IST

నిరుద్యోగ యువతకు ఎన్టీపీసీ యాజమాన్యం బాసటగా నిలుస్తోంది. తక్కువ విద్యార్హతతో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడాలనే వారికోసం ప్రభుత్వం ఐటీఐలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఆలోచనలను ఆచరణలో పెడుతూ ఎన్టీపీసీ, గాజువాకలోని ఐటీఐ సంయుక్తంగా విద్యార్థులకు డ్రైవింగ్ శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణతో యువకులు స్వయం ఉపాధి పొందుతూ... కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.

ntpc and iti jointly driving training at gajuwaka in visakha
గాజువాక ఐటీఐ వాహన డ్రైవింగ్‌ శిక్షణ

గాజువాక ఐటీఐ వాహన డ్రైవింగ్‌ శిక్షణ

విశాఖ జిల్లా గాజువాకలోని ఐటీఐ ఉచితంగా డ్రైవింగ్‌లో 45 రోజుల శిక్షణ ఇస్తోంది. కోర్సులో బ్యాచ్‌కు 20 మంది చొప్పున మొదటి 15 రోజులు విద్యార్థులకు పాఠాలు బోధిస్తారు. ట్రాఫిక్ నిబంధనలు, బ్యాటరీ, ఆయిల్‌ లెవెల్, కూలెంట్‌ తనిఖీ, పంక్చర్‌ అయితే టైర్లు మార్చడం, ఇంజిన్‌ ఆయిల్‌ మార్చడం, ఏసీ ఫిల్టర్‌ శుభ్రత, బ్రేకులు, బ్రేక్‌ ఆయిల్‌ తనిఖీతోపాటు చిన్నచిన్న మరమ్మతులు చేయడం నేర్పిస్తారు.

శిక్షణలో భాగంగా మిగిలిన 35 రోజులపాటు ఒక వ్యక్తికి ప్రతిరోజు ఐదు కిలోమీటర్ల చొప్పున నిపుణుల బృందంతో డ్రైవింగ్‌ నేర్పిస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్‌లో డ్రైవింగ్‌కు మంచి డిమాండ్ ఉంది. లైట్ వెహికిల్ లైసెన్స్ ఉన్నవారే ఈ శిక్షణకు అర్హులు. ఈ శిక్షణ కుటుంబ పోషణకు ఉపయోగపడుతుందని శిక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా వాహన డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు సింహాద్రి ఎన్టీపీసీ ఏడాది క్రితం ఈ ఐటీఐతో ఒప్పందం చేసుకుంది. ఇందులో బ్యాచ్‌కి 20 మంది చొప్పున తర్ఫీదుపొందుతూ... మూడు బ్యాచుల్లో 60మంది విద్యార్థులు ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. ఐటీఐకి వెళ్లడానికి ఉచితంగా రెండు నెలలపాటు మెట్రో బస్​పాస్​, ఖాకీ చొక్కా, ఉత్తీర్ణత సాధించిన అనంతరం ప్రభుత్వ ఐటీఐ పేరుతో ధ్రువపత్రం అందిస్తోంది. శిక్షణ ప్రారంభానికి ముందు ఎల్‌ఎల్‌ఆర్, ముగిసిన తర్వాత పూర్తిస్థాయి డ్రైవింగ్‌ లెసెన్స్‌ ఇస్తారు.

మున్ముందు మరింత మంది గ్రామీణ నిరుద్యోగ యవతకు డ్రైవింగ్‌లో శిక్షణ అందించి అండగా నిలుస్తామని ఎన్టీపీసీ అధికారులు చెబుతున్నారు.

ఇదీచూడండి.మన్యం సంతలో ఫ్లెక్సీలు.. మిలీషియాలకు పోలీసు హెచ్చరికలు

ABOUT THE AUTHOR

...view details