ఉత్తర అమెరికాలో కోమటి జయరాం, గోకుల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన్మభూమి అనే స్వచ్చంద సంస్థ ద్వారా నిధులు సమీకరిస్తున్నారు. వీటిని గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ, స్నేహ సంధ్య సంస్థల ద్వారా పలువురు కొవిడ్ బాధితులకు వినియోగిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో నివసించే వారికి మెరుగైన ఆరోగ్యం కల్పించడంతో పాటు కొవిడ్ చికిత్స కోసం ప్రాథమిక మందులు, పల్స్ ఆక్సిమీటర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ను దాతల సహాయంతో విశాఖలో ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. గిరిజనులను కరోనా నియంత్రణకు సంకల్పించామని గౌతు లచ్చన్న బలహీన వర్గాల కార్యదర్శి వెంకన్న చౌదరి అన్నారు.
గిరిజనులకు మెరుగైన కొవిడ్ చికిత్స కోసం.. ఎన్ఆర్ఐలు సాయం.. - గౌతు లచ్చన్న బలహీన వర్గాలు సంస్థ ద్వారా గిరిజనులకు మెరుగైన వైద్యం
ఎన్ఆర్ఐకి చెందిన ఓ స్వచ్ఛంధ సంస్థ నిధులు సేకరించి.. గౌతు లచ్చన్న బలహీన వర్గాలు సంస్థ, స్నేహ సంధ్య సంస్థల ద్వారా కొవిడ్ చికిత్సకు అవసరమైన మందులను సరఫరా చేస్తున్నారు.
![గిరిజనులకు మెరుగైన కొవిడ్ చికిత్స కోసం.. ఎన్ఆర్ఐలు సాయం.. Better covid treatment for tribals](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-02:12:00:1622536920-ap-vsp-91-01-covid-kits-distribution-in-tibal-areas-av-ap10083-01062021140412-0106f-1622536452-47.jpg)
గిరిజనులకు మెరుగైన కొవిడ్ చికిత్స