ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు చెల్లించాల్సిన బకాయిలు జిల్లాలో పేరుకుపోయాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకన్న అన్నారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లావ్యాప్తంగా రూ. 18 కోట్ల వరకు ఉన్నట్లు తెలిపారు. అధికారులు స్పందించి కూలీలకు బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధి కూలీలకు చెల్లించాల్సిన నిధులను గ్రామ సచివాలయాలు ఇతర భవన నిర్మాణానికి మళ్లిస్తున్నారని ఆరోపించారు. కరోనా సమయంలో కూలీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని... వారికి త్వరగా బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
'ఉపాధి హమీ పథకం బకాయిలను చెల్లించండి'
విశాఖ జిల్లాలో ఉపాధి హామీ పథకం బకాయిల చెల్లింపులు ఆగిపోయాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకన్న అన్నారు. అధికారులు స్పందించి కూలీల బకాయిలు చెల్లించాలని కోరారు.
పేరుకుపోయిన ఉపాధి హామీ పథకం బకాయిలు