పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసే ఉచిత ఇళ్ల స్థలాల అభివృద్ధి పనులను వేగవంత చేయాలని ఎన్ఆర్జీఎస్ ఏపీడీ మల్లికార్జునరావు అధికారులను ఆదేశించారు. విశాఖ జిల్లా పాయకరావుపేట పరిధి పీఎల్ పురంలో ఏర్పాటు చేస్తున్న మెగా లేఅవుట్ల ప్రక్రియ పనులను ఆయన పరిశీలించారు. కొంత మేరకే పనులు పూర్తికాగా... మిగిలిన అభివృద్ధి పనులు ముమ్మరం చేయాలని ఆదేశించారు. అధికారుల౦తా సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
'ఇళ్ల స్థలాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి' - visakhapatnam district news
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందించే ఇళ్ల స్థలాల అభివృద్ధి పనులను విశాఖ జిల్లా పీఎల్ పురంలో ఎన్ఆర్జీఎస్ ఏపీడీ మల్లికార్జునరావు పరిశీలించారు.
పీఎల్ పురంలో అభివృద్ధి పనుల పరిశీలిస్తున్న అధికారులు