ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారత్ కథనానికి స్పందన.. నిధుల మళ్లింపుపై నోటీసులు - మాడుగుల పంచాయతీ నిధుల మళ్లింపుపై సిబ్బందికి నోటీసులు

విశాఖ జిల్లా మాడుగుల గ్రామ పంచాయతీలో నిధులు పక్కదారి పట్టిన ఘటనపై "ఈటీవీ భారత్" లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. సంబంధిత సిబ్బందికి పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు. తక్షణమే నిధులను జమ చేయాలని నోటీసుల్లో సూచించినట్లు చెప్పారు.

notices to madugula panchayathi staff on funds diversion in vizag district
నిధుల మళ్లింపుపై పంచాయతీ సిబ్బందికి నోటీసులు

By

Published : Sep 23, 2020, 5:57 PM IST

విశాఖ జిల్లా మాడుగుల పంచాయతీకి చెందిన ఇంటి పన్నులు, సంత వేలం పాట నుంచి వచ్చిన నిధులను పంచాయతీ ఖాతాలో జమ చేయకుండా సిబ్బంది పక్కదారి పట్టించిన వైనంపై ఈటీవీ భారత్ కథనం ప్రచురించింది. దీంతో జిల్లా పంచాయతీ అధికారి కృష్ణకుమారి దీనిపై ఆరా తీశారు.

గ్రామ పంచాయతీకి చెందిన రూ.33 లక్షల మేరకు నిధులు పక్కదారి పట్టినట్లు గుర్తించారు. వాటిలో ఇప్పటికే రూ.20 లక్షలు పంచాయతీ ఖాతాలో జమ చేశారు. మిగిలిన నిధులు రికవరీ చేస్తామని నర్సీపట్నం డీఎల్పీవో శిరీషారాణి చెప్పారు. ఈ మేరకు మాడుగుల ఈవో పీఆర్డీ మీనాకుమారి ఆదేశాలతో పంచాయతీ ఈవో సత్యనారాయణ, సంబంధిత సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. తక్షణమే పంచాయతీ నిధులు జమ చేయాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details