విశాఖ మహా నగరపాలక సంస్ధ పరిధిలోని 187 దుకాణాలలో.. బినామీలు ఉన్నట్లు గుర్తించామని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ సృజన వెల్లడించారు. జీవీఎంసీ ఆదాయం పెంపొందించేందుకు, ఆదాయ లోపాలను సరిదిద్దేందుకు ప్రణాళిక అమలు చేయనున్నట్టు ప్రకటించారు. బినామీల ఆధీనంలో ఉన్న దుకాణాలను.. వాస్తవ గుత్తేదారులకు నోటీసులు జారీ చేశామన్నారు. గడువు ముగిసే లోపల దుకాణాలు ఖాళీ చేయనట్లయితే.. వాటిని స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. గుత్తేదారుడు అప్పటివరకు చెల్లించవలసిన అద్దె మొత్తం.. దుకాణంలో ఉన్న పరికరాలు, సామగ్రి వేలం వేసి బకాయిల కింద దానిని జమ చేస్తామన్నారు. లీజు పునరుద్ధరణ చేయకుండా అనధికారికంగా ఉన్న 389 దుకాణాలను గుర్తించామని.. వీరంతా అక్రమంగా ఉన్నట్టుగానే పరిగణిస్తామని వివరించారు. 3 సంవత్సరాలు లీజు దాటిన దుకాణాలకు.. మళ్లీ వేలం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. అద్దె చెల్లించని లీజుదారుల నుంచి రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను ఉపయోగించి.. అద్దె వసూలు చేస్తామని కమిషనర్ సృజన స్పష్టం చేశారు.
విశాఖలోని దుకాణ గుత్తేదారులకు నోటీసులు - జీవీఎంసీ కమిషనర్ సృజన వార్తలు
విశాఖ మహా నగరపాలక సంస్ధ పరిధిలోని 187 దుకాణాలలో.. బినామీలు ఉన్నట్లు గుర్తించామని మున్సిపల్ కమిషనర్ సృజన తెలిపారు. బినామీల ఆధీనంలో ఉన్న దుకాణాలను.. వాస్తవ గుత్తేదారులకు నోటీసులు జారీ చేశామన్నారు. గడువు ముగిసే లోపల దుకాణాలు ఖాళీ చేయనట్లయితే.. వాటిని స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.
బినామీల ఆధీనంలో ఉన్న దుకాణాల వాస్తవ గుత్తేదారులకు నోటీసులు