ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

No CCTVs in VSP Railway Station: విశాఖ రైల్యే స్టేషన్‌లో భద్రత ఎక్కడ.. వెల్లువెత్తుతున్న విమర్శలు - Visakha railway station today news

Not working CCTV cameras in Visakha railway station Increasing thefts: విశాఖ రైల్యే స్టేషన్‌లోని నిఘా నేత్రాలు సక్రమంగా పని చేయక.. ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. పర్సు మాయమైందని కొందరు, తమ సంబంధీకులు కిడ్నాప్‌ అయ్యారని మరికొందరు ఫిర్యాదులు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి.. భద్రత కల్పించండి అంటూ ప్రయాణికులు వేడుకుంటున్నారు.

Visakha railway
Visakha railway

By

Published : Jun 13, 2023, 4:54 PM IST

Not working CCTV cameras in Visakha railway station Increasing thefts: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అతిపెద్ద రైల్యే స్టేషన్లలో విశాఖపట్నం రైల్యే స్టేషన్ ఒకటి. ఎప్పుడూ చూసినా వేలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. ఈ రైల్వే స్టేషన్‌‌‌కు దేశంలోనే ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. ఇక్కడి నుంచి ప్రతి రోజూ దాదాపు 120 రైళ్లల్లో లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. దేశంలో నిత్యం రద్దీగా ఉండే రైల్యే స్టేషన్లలో ఈ రైల్యే స్టేషన్ 20వ స్టేషన్. ఈ రైల్వే స్టేషన్‌లోకి వచ్చే ప్రతి రైలు బండి ప్లాట్‌ఫారాలు ఖాళీగా లేక కొన్ని రైళ్లు కొత్తవలస-దువ్వాడ మార్గంలో ఆగుతుంటాయి. ఇంతటి చరిత్ర కల్గిన విశాఖ రైల్యే స్టేషన్‌పై గతకొన్ని రోజులుగా విమర్శలు తలెత్తుతున్నాయి. రైల్యే స్టేషన్‌లో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయక.. ప్రయాణికులు దొంగల భయంతో గజగజ వణికిపోతున్నారు. సీసీ కెమెరాల పట్ల అధికారులు వ్యవహరిస్తున్న నిర్లక్ష్యంపై ప్రయాణికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విశాఖ రైల్యేస్టేషన్‌లో నిద్రపోతున్న నిఘా..పెరిగిపోతున్న దొంగతనాలు

పని చేయని నిఘా నేత్రలు-ప్రయాణికులు అవస్థలు..విశాఖ రైల్వేస్టేషన్‌కు దేశంలోనే ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడి నుంచి రోజూ 120 రైళ్లల్లో లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ స్టేషన్‌లో నిఘా నేత్రాలు సక్రమంగా పనిచేయకపోవడం ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

రైల్వేస్టేషన్‌లో పెరుగుతున్న కిడ్నాపులు, దొంగతనాలు.. విశాఖ రైల్వేస్టేషన్‌లో సీసీ కెమెరాలు అంతంతమాత్రంగా పని చేస్తున్నాయి. దొంగతనాలు, కిడ్నాప్‌లకు పాల్పడే వ్యక్తులను గుర్తించడం పోలీసులకు కష్టమవుతోంది. మూడు నెలల కిందట ఇద్దరు యువకులు భువనేశ్వర్ వెళ్లేందుకు స్టేషన్‌కు వెళ్లారు. అందులో ఒకరు టికెట్‌ తెచ్చేలోపే ప్లాట్‌ ఫామ్‌పై ఉన్న మరో యువకుడు అదృశ్యమయ్యాడు. స్టేషన్‌లో సీసీ కెమెరాలను పరిశీలించగా అవి సక్రమంగా పని చేయకపోడంతో స్పష్టత లేకుండా పోయింది. పర్సు మాయమైందని కొందరు, తమ సంబంధీకులు కిడ్నాప్‌ అయ్యారని మరికొందరు ఫిర్యాదులు చేస్తున్నా.. సీసీ కెమెరాల వైఫల్యం కారణంగా పోలీసుల దర్యాప్తు ముందుకు సాగడం లేదన్న విమర్శలున్నాయి.

సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి-భద్రత కల్పించండి..విశాఖపట్నం స్టేషన్ విస్తీర్ణం, ప్రయాణికుల సామర్థ్యం ఆధారంగా 200లకు పైగా కెమెరాలు అవసరం. కానీ, ఇక్కడ కనీసం 40 కూడా కనిపించడం లేదు. ఉన్న వాటిల్లో కొన్ని అంతంత మాత్రమే పని చేస్తున్నాయి. మరికొన్ని పూర్తిగా పని చేయడం లేదు. ఇలా ఉంటే స్టేషన్‌లో భద్రత ఎలా ఉంటుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిఘా కెమెరాల వ్యవస్థ గురించి పలుమార్లు రైల్వే అధికారులకు తెలిపినా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. నిఘా అధికారులు ఇక్కడి లోపాలను గుర్తించినా.. పరిస్థితులు చక్కదిద్దలేదు. విశాఖ రైల్వే స్టేషన్‌లో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తమకు భద్రత కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details