ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

vmrda master plan: వీఎంఆర్​డీఏ ప్లాన్​ ..స్థిరాస్తి వ్యాపారానికి అనుకూలంగా ఉంది!

విశాఖ మెట్రోపాలిటన్ ప్రాంతం అభివృద్ధి సంస్థ (వీఎంఆర్​డీఏ) మాస్టర్ ప్లాన్​ను.. సామాన్య ప్రజలకు గృహవసతి కల్పించే విధంగా తిరిగి రూపొందించాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజ శర్మ కోరారు. ఇది కేవలం స్థిరాస్తి వ్యాపారులకు అనుకూలంగా మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు.

north andhra pradesh development   forum conference on vmrda plan
ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక సమావేశం

By

Published : Jul 26, 2021, 7:22 PM IST

విశాఖ మెట్రోపాలిటన్ ప్రాంతం అభివృద్ధి సంస్థ (వీఎంఆర్​డీఏ) మాస్టర్ ప్లాన్​ను ఈ ప్రాంత సామాన్య ప్రజలకు గృహవసతి కల్పించే విధంగా తిరిగి రూపొందించాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజ శర్మ కోరారు. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున రహదారులు నిర్మించి.. స్థిరాస్తి వ్యాపారానికి అవకాశం కల్పించే విధంగా ల్యాండ్ పూలింగ్ చేపడతామని మాస్టర్ ప్లాన్​లో పేర్కొన్నారని అన్నారు. ఈ విధంగా చేస్తే సామాన్యుల నుంచి భూములు బలవంతంగా తీసుకునే అవకాశం కలుగుతుందని..ఇది సమర్ధనీయం కాదని వ్యాఖ్యానించారు.

సామాన్యులకు గృహ వసతి కల్పించే విధంగా ఏ రకమైన ప్రతిపాదన మాస్టర్ ప్లాన్​లో లేదని అన్నారు. దానిపై అభ్యంతరాలు తెలిపేందుకు జూలై 31వ తేదీ వరకు గడువు ఇచ్చారని వెల్లడించారు. ఈ సుదీర్ఘ నివేదిక ఆంగ్లంలో ఉందని..దీన్ని పూర్తిగా తెలుగులోకి అనువదించి ప్రచురించి, అభ్యంతరాల గడువును పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వేదిక కోశాధికారి బీ.బీ గణేష్ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details