విశాఖ జిల్లా అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. కొత్త అమావాస్య జాతరకు వేల సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చలువ పందిళ్లు,తాగు నీటి సౌకర్యం,ఉచిత మజ్జిగ పంపిణీ వంటి సౌకర్యాలు కల్పించారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
నూకాంబిక దర్శనానికి పోటెత్తిన భక్తులు - నూకాలమ్మ దేవాలయం
వేల సంఖ్యలో హాజరైన భక్తులతో అనకాపల్లిలోని నూకాంబిక అమ్మవారి దేవాలయం సందడిగా మారింది. కొత్త అమావాస్య జాతరకు వేకువజామునుంచే క్యూలైన్లలో బారులు తీరారు.
నూకాలమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు