ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్టోబర్ 15న వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖలో భారీ ర్యాలీ: రాజకీయేతర ఐకాస - రాజకీయేతర ఐకాస సమావేశం

JAC MEETING : విశాఖ పరిపాలనా రాజధాని కోసం రాజీనామాలకూ సిద్ధమని వైకాపా నేతలు స్పష్టం చేశారు. సాగరనగరంలో మూడు రాజధానులకు మద్దతుగా రాజకీయేతర ఐకాస సమావేశం జరిగింది. ఇందులో వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖను రాజధానిగా చేయాలని నేతలు కోరారు.

NON POLITICAL JAC MEETING
NON POLITICAL JAC MEETING

By

Published : Oct 8, 2022, 12:44 PM IST

NON POLITICAL JAC MEETING : మూడు రాజధానులకు మద్దతుగా విశాఖలో రాజకీయేతర ఐకాస సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి అమర్నాథ్, వైకాపా ఎమ్మెల్యేలు, వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఐకాసకి కన్వీనర్‌గా మాజీ ఉపకులపతి లజపతి రాయ్, సహ కన్వీనర్‌గా దేముడు నియమితులయ్యారు. అక్టోబర్ 15న వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించాలని రాజకీయేతర ఐకాస నిర్ణయించింది. వారంపాటు అన్ని నియోజకవర్గాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపింది.

తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆ పత్రాన్ని రాజకీయేతర ఐకాస సమావేశంలో కరణం ధర్మశ్రీ చూపించారు. రాజీనామా లేఖను ఐకాస కన్వీనర్‌కు అందజేసిన ఎమ్మెల్యే.. విశాఖను అమరావతి రైతులు వ్యతిరేకిస్తే.. అమరావతికి మేం వ్యతిరేకం అని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర వాసిగా రాజీనామాకు అచ్చెన్నాయుడు సిద్ధపడాలని డిమాండ్​ చేశారు.

అక్టోబర్ 15న వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖలో భారీ ర్యాలీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details