విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన సమాలోచన, బాషా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు హోమియో వైద్యులు శశిధర్, యోగ ప్రియ.. అనకాపల్లిలోని వలస కూలీలను ఆదుకున్నారు. అజీమ్ ప్రేమ్ జీ, ఫిలాంత్రఫిక్ ఇనీషియేటివ్, లిబిటిక్ ఇండియా ఆర్థిక సాయంతో వలస కార్మికులకు స్వగ్రామాలకు వెళ్లేందుకు వాహనాన్ని ఏర్పాటు చేశారు.
విశాఖ జిల్లా అనకాపల్లిలో పశ్చిమబంగాకు చెంది 13 మంది మగ్గం పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయారు. గ్రామానికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న వీరికి స్వచ్ఛంద సంస్థలు ప్రైవేట్ వాహనం ఏర్పాటు చేశాయి. అనకాపల్లి పట్టణ సీఐ భాస్కరరావు ఆధ్వర్యంలో వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపారు.