విశాఖలో కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వటం నిలిపేశారు. రెండు రోజుల నుంచి వ్యాక్సిన్ సెంటర్ల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. వందల్లో టీకాలు ఉంటే.. వేలల్లో జనం వస్తున్నారు. దీంతో ప్రణాళికాబద్దంగా వ్యాక్సిన్ వెయ్యాలని జిల్లా యంత్రాంగం ప్రణాళిక వేస్తోంది. ప్రస్తుతం అన్ని చోట్ల టీకా వేయడం లేదని బోర్డులు పెట్టారు. కేంద్ర ప్రభుత్వ, ఇతర ప్రధాన శాఖల ఉద్యోగులు మొదటి డోసు వేసుకుని..రెండో డోసుకు సిద్ధంగా ఉన్నారు.
నేటి నుంచి కొవాగ్జిన్ రెండో డోసు ఇచ్చేందుకు ఏర్పాట్లు - covaxine second dose news
విశాఖలో టీకా పంపిణీ నిలిచిపోయింది. వ్యాక్సిన్ కొరత వల్ల నేటి నుంచి కొవాగ్జిన్ రెండో డోసు మాత్రమే వేయటానికి ఏర్పాట్లు చేశారు. మొదటి డోసు తీసుకున్న వారిని నిర్దారించుకుని టీకాాాాాా ఇవ్వనున్నారు.
కొవిడ్ వ్యాక్సిన్
మార్చి రెండో వారం కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారు, ఏప్రిల్ మొదటి వారంలో కొవాగ్జిన్ వేయించుకున్న వారు ఈ వారం రోజుల లోపు టీకా వేయించుకోవాలి. నేడు విశాఖలో కొవాగ్జిన్ రెండో డోసు వేయడానికి ఏర్పాట్లు చేశారు. జిలాల్లోనూ, నగరంలోనూ మొదటి డోసు తీసుకున్న వారిని నిర్దారించుకుని..కొవాగ్జిన్ రెండో డోసు మాత్రమే ఇవ్వనున్నారు.
ఇదీ చదవండి:'కేంద్రం నుంచి డోసులు రాని కారణంగానే వ్యాక్సిన్ కొరత'