విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాంలో జరిగిన గిరిజన వారపు సంత.. కరోనా ప్రభావంతో బోసిపోయింది. ప్రతివారం ఇక్కడ జరిగే సంతకు.. చీడికాడ, మాడుగుల, పాడేరు, హుకుంపేట, అనంతగిరి మండలాలకు చెందిన గిరిజన గ్రామాలతో పాటు మైదాన గ్రామాలు, పట్టణ ప్రాంతాల నుంచి రైతులు, ప్రజలు, వ్యాపారులు వస్తుంటారు. కరోనా విజృంభిస్తుండటంతో.. సంతకు ప్రజలు తక్కువగా వచ్చారు. అక్కడకు వచ్చిన వారు కొవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్కు తప్పనిసరిగా ధరించాలని పోలీసులు సూచించారు.
కరోనా ఎఫెక్ట్: బోసిపోయిన కోనాం గిరిజన వారపు సంత - no rush in konam weekly market
కరోనా ప్రభావంతో ప్రజలు బయటికి రావాలంటే జంకుతున్నారు. ఆ కారణంతోనే విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాంలో జరిగిన గిరిజన వారపు సంత.. బోసిపోయింది. ప్రతి వారం ఎంతో మందితో సందడిగా ఉండే ఈ సంత.. మహమ్మారి వ్యాప్తి కారణంగా తక్కువమందితో కనిపించింది.
vishaka
ఇదీ చదవండి:
పనస కాదు... పే..........ద్ద దోస