విశాఖ జిల్లా గొలుగొండలోని బాలయోగి గురుకుల పాఠశాలలో.. మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా పూర్తిస్థాయిలో ఉండటం లేదని ఆరోపించారు. ఇతరులకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడంతో నిర్వహణ సక్రమంగా లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
గురుకుల పాఠశాలలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 640 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి మెరుగైన విద్యను అందించడంతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాల్సిన ఉంది. ఇందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం మెనూ నిర్దేశించి విద్యాలయాలకు జారీచేసినా.. ఆహారం సరిగ్గా లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.