కరోనా కోరలు చాచి ప్రపంచం అతలాకుతలం చేస్తుంటే విశాఖ జిల్లా పాడేరు వాసులు మాత్రం మాంసం కోసం.. చేపల కోసం ఎగబడుతున్నారు. ఆదివారం కారణంగా.. మాంసం ప్రియులు చేపల మార్కెట్ వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడారు. లాక్ డౌన్ నిబంధనలు, భౌతిక దూరాన్ని మరిచి కొనుగోళ్లపైనే ఆరాటం చూపారు.
కరోనా అంటే ఖాతరు లేదా? భౌతిక దూరం పాటించరా? - visakha paderu latest news update
విశాఖ జిల్లా పాడేరు ప్రజలు.. భౌతిక దూరాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కరోనా వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లోనూ ఇలా చేపల మార్కెట్ లో నిర్లక్ష్యం ప్రదర్శించారు. దుకాణాల ఎదుట బారులు తీరారు.
చేపల కోసం ఎగబడ్డ పాడేరు వాసులు