కరోనా వేళ ఎన్నికలు వద్దంటూ పోరాటానికి దిగిన ఉద్యోగ సంఘాలు.. ఎన్నికల విధుల్లో నిబంధనలు పాటించకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ జిల్లాలో తొలి విడత పోలింగ్‌లో అధికారులు, సిబ్బంది ఎలాంటి కొవిడ్ నిబంధనలు పాటించలేదు.
ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి పీపీఈ కిట్లు ఇస్తే.. వాటిని మూలన పడేశారు. కనీసం క్యూలో నిల్చున్న ఓటర్లకు సైతం శానిటైజర్ ఇవ్వలేదు. పోలింగ్ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించటంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఓట్ల లెక్కింపు సమయంలోనూ పీపీఈ కిట్లు వేసుకోలేదు. కనీసం రెండో విడత ఎన్నికల్లో అయినా.. కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని ఓటర్లు కోరుతున్నారు.