ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నివర్ వల్ల ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం' - నివర్ తుపాను న్యూస్

రుతు పవనాలు తరువాత వచ్చే తుపాన్లు ఎక్కువ వర్షాన్నిస్తాయని ఆంధ్ర విశ్వ విద్యాలయ వాతావరణ అధ్యయన నిపుణులు ఆచార్య ఎస్​ఎస్​వీఎస్ రామకృష్ణ స్పష్టం చేశారు. నివర్ అలాంటిందేనన్న ఆయన...తుపాను వల్ల రాయల సీమలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

నివర్ వల్ల ఎక్కవ వర్షపాతం నమోదయ్యే అవకాశం
నివర్ వల్ల ఎక్కవ వర్షపాతం నమోదయ్యే అవకాశం

By

Published : Nov 25, 2020, 7:19 PM IST

నివర్ తుపాను వల్ల రాయల సీమలో భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్ర విశ్వ విద్యాలయ వాతావరణ అధ్యయన నిపుణులు, ఆచార్య ఎస్​ఎస్​వీఎస్ రామకృష్ణ స్పష్టం చేశారు. ఈ ఎడాది మన రాష్ట్రానికి తుపాన్లు తక్కువ వచ్చాయన్న ఆయన... అల్ప పీడనాలు చాలా వరకు తుపానుగా మారకుండా తమిళనాడు తీరం వైపు వెళ్లిపోయాయన్నారు. ఈ ఏడాది మొత్తానికి నివర్ తుపాను రాష్ట్రానికి మొదటి తుపానుగా కనిపిస్తోందని అన్నారు. ప్రతి ఏటా అక్టోబరు - నవంబరు మాసంలో తుపాన్లు ఏర్పడతాయని..., 1999లో ఒడిశాలో ఏర్పడిన సూపర్ సైక్లోన్ అత్యంత ప్రభావమైన తుపానుగా వెల్లడించారు. ఆ తర్వాత 21 ఏళ్లకు హంఫెన్ తుపాను 2019లో వచ్చిందని వెల్లడించారు. నివర్ తుపాను రుతుపవనాలు వచ్చాక ఏర్పడిందని రామకృష్ణ తెలిపారు. రుతు పవనాలు తరువాత వచ్చే తుపాన్లు ఎక్కువ వర్షాన్నిస్తాయన్నారు. సముద్ర ఉష్ణోగ్రతల కారణంగా ఇప్పుడు వచ్చే తుపాన్ల నుంచి గాలి తక్కువగా వీస్తాయని..వర్షాలు ఎక్కువగా కురుస్తాయని తెలిపారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో తూర్పు కోస్తా తీరం వెంబడి బలమైన చల్ల గాలులు ఉండటం వల్ల, సముద్ర ఉష్ణోగ్రతలు తక్కువై తుపానుపై ప్రభావం చుపిస్తాయని రామకృష్ణ స్పష్టం చేశారు. ఈ సమయంలో వచ్చే తుపానులు మందకొడిగా కదులుతాయన్న ఆయన...తుపాను వల్ల బలమైన గాలి, భారీ వర్షాలనే రెండు ప్రమాదాలు ఉంటాయన్నారు.

నివర్ వల్ల ఎక్కవ వర్షపాతం నమోదయ్యే అవకాశం

ABOUT THE AUTHOR

...view details