ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Rishikonda issue: రుషికొండపై తవ్వకాల తీరుపై ఎన్‌జీటీ కమిటీ..!

Rishikonda issue: విశాఖపట్నం రుషికొండ వద్ద రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రాజెక్టు పనులవాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు ఎన్‌జీటీ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సభ్యులు త్వరలోనే క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్నారు. రుషికొండ వద్ద నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని పర్యావరణానికి హానికలుగుతోందని ఎంపీ రఘురామకృష్ణరాజు గతంలో ఎన్‌జీటీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్‌జీటీ ఈ నెల 17న ప్రాథమిక విచారణ చేపట్టింది. ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వాన్ని పేర్కొంది.

rishikonda
రుషికొండపై తవ్వకాలు

By

Published : Dec 23, 2021, 9:10 AM IST

Rishikonda issue: విశాఖపట్నంలో రుషికొండ వద్ద ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రాజెక్టు పనులపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) స్పందించింది. అక్కడ వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటుకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ కమిటీ సభ్యులు త్వరలోనే క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్నారు. రుషికొండ వద్ద నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని, బృహత్తర ప్రణాళికను మీరారని, పర్యావరణానికి హానికలుగుతోందని ఎంపీ రఘురామకృష్ణరాజు గతంలో ఎన్‌జీటీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్‌జీటీ ఈ నెల 17న ప్రాథమిక విచారణ చేపట్టింది. ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వాన్ని పేర్కొంది.

ఏపీ నగరాభివృద్ధి సంస్థ చట్టం ప్రకారం బృహత్తర ప్రణాళికలో పర్యావరణ సున్నిత ప్రాంతాన్ని పరిరక్షించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయడంపై ఎన్‌జీటీ స్పందించింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం తవ్వకాల కారణంగా రుషికొండ పరిసర ప్రాంతాల్లోని వాతావరణం తీవ్రంగా దెబ్బతింటోందని పేర్కొనడంతో ఈ కమిటీని నియమించినట్లు అందులో పేర్కొన్నారు. నలుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర కమిటీలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ), రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ ), రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనాల ప్రాథికారసంస్థ (ఎస్‌ఈఐఏఏ), జిల్లా కలెక్టర్‌ ఉండాలని పేర్కొంది. ఈ కమిటీకి ఎస్‌ఈఐఏఏ నోడల్‌ ఏజెన్సీగా సమన్వయం చేయాలని సూచించింది. రెండు వారాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టడంతో పాటు స్థానికులతోనూ మాట్లాడతారని పేర్కొంది. నివేదిక రెండు నెలల్లోగా ఇవ్వాలని స్పష్టం చేసింది.

ఆది నుంచి అనుమానాలే..రుషికొండ వద్ద చేపడుతున్న ప్రాజెక్టు విషయంలో ఆది నుంచీ అనుమానాలే నెలకొన్నాయి. సీఆర్‌జెడ్‌ (తీర ప్రాంత జోన్‌ ), పర్యావరణ, అటవీశాఖ అనుమతులు తీసుకున్నప్పటికీ ప్రస్తుతం ఇక్కడ కొండ మీద జరుగుతున్న పనులు పర్యావరణానికి పూర్తి విఘాతం కలిగించేలా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. కొండ కింద నుంచి పైవరకు సగానికిపైగా తొలిచేశారు. ఎక్కడా పచ్చదనాన్ని మిగల్చలేదు. చుట్టూ తవ్వకాలు చేపట్టడంతో బండరాళ్లు రోడ్డు మీదికి దొర్లుకువచ్చేలా ఉన్నాయి. సీఆర్‌జెడ్‌ అనుమతులున్నప్పటికీ నిబంధనలకు మించి పనులు జరుగుతున్నట్లు ఉందని నిపుణులు అంటున్నారు. సముద్రం పక్కనే ఉన్న కొండను పూర్తిగా తొలిచేస్తే కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయంటున్నారు. ఇక్కడ తవ్విన మట్టిని సమీప సముద్ర తీరంలో డంపింగ్‌ చేయడంపైనా అభ్యంతరం వ్యక్తమవుతోంది.


ఇదీ చదవండి:

AP HIGH COURT: రిషి కొండపై.. "వుడా" మాస్టర్ ప్లాన్ అమలు చేయాలి: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details