ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దశాబ్దాలుగా అడవి బిడ్డలకు తప్పని డోలీ కష్టాలు - News of the transfer of a pregnant woman to the hospital with the help of Dolly in Visakhapatnam

కొండకోనల్లో ఉండే మహిళలకు.. కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి ప్రసవమయ్యే వరకు దినదిన గండమే. ఎప్పుడే ఇబ్బంది వచ్చినా.. వైద్యం కోసం సాహసం చేయక తప్పని స్థితి. డోలీ కట్టి కిలోమీటర్ల మేర మోసుకెళితే గానీ.. ఆసుపత్రికి చేరుకోలేని దయనీయ స్థితి. 2 వేల అడుగుల ఎత్తునున్న గిరిజన గూడెం నుంచి.. గర్భిణీని తరలించేందుకు ఓ కుటుంబం చేసిన పోరాటం అనన్యసామాన్యం.

ఇంకెన్నీ రోజులు ఈ డోలీల మోత!
ఇంకెన్నీ రోజులు ఈ డోలీల మోత!

By

Published : Aug 12, 2020, 1:41 PM IST

Updated : Aug 12, 2020, 2:04 PM IST

ఇంకెన్నీ రోజులు ఈ డోలీల మోత!
విశాఖ మన్యంలో కొండలు, కోనలకు లెక్కేలేదు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, వేలాది అడుగుల కొండలపై నుంచి.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కిందకి దిగి రావాల్సిందే. ఇక అలాంటి చోటు నుంచి గర్భిణీలను ఆసుపత్రికి తీసుకెళ్లడమంటే మాటలా..?.. అందుకోసం అడవిబిడ్డలు అతిపెద్ద సాహసం చేయక తప్పదు.

పాడేరు మండలం దేవాపురం పంచాయతీ కూడా అలాంటిదే. అత్యంత ఎత్తయిన కొండల మీద ఉంటుంది. ఆ పరిధిలోని హనుమంతపురంలో నివాసం ఉండే ఓ నిండు గర్భిణీకి... పురిటి నొప్పులు వచ్చాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నలుగురు కుటుంబ సభ్యులు కలిసి పోరాటం ప్రారంభించారు. డోలీ కట్టి గర్భిణీని మోసుకుంటూ... కొండ మార్గాన సాహసోపేతంగా అడుగులేశారు. ఏమాత్రం అడుగు తడబడినా ప్రాణగండం తప్పదనేలా ఉన్న చిత్తడి కొండలపై... అత్యంత జాగ్రత్తగా ముందుకు సాగారు. అలా కొన్ని కిలోమీటర్ల మేర పయనించి... దూరాన ఉన్న మాడుగుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

గిరిజన గూడేల నుంచి డోలీ కట్టి గర్భిణీలను తరలించడం నిత్యకృత్యమే. అయితే హనుమంతపురం లాంటి చోటు నుంచి వెళ్లడం మాత్రం... ఒకరకంగా పర్వతం మీదినుంచి దిగినట్లే. అతిపెద్ద చెట్లు, ఎటుచూసినా గుబురు పొదలు, పెద్దపెద్ద బండరాళ్లతో ప్రమాదకరంగా ఉండే కొండలపై నుంచి కిందికి రావాలంటే... కాసేపటికే కాళ్లు పట్టేస్తాయి. అంత కష్టతరమైన ప్రాంతం నుంచి నిండు చూలాలిని మోసుకెళ్లడమంటే... అంతకుమించిన సాహసం మరొకటి ఉండదేమో. అయినా పట్టు సడలకుండా, అకుంఠిత దీక్షతో మాడుగుల చేరుకున్న గిరిపుత్రులు... నిజంగా సాహస వీరులే.

పాడేరు ఐటీడీఏ పరిధిలో ఏ సమావేశం జరిగినా.. మంత్రులు, ప్రజాప్రతినిధుల నోట కచ్చితంగా వినబడే మాట 'డోలీ కష్టాలే'. ఏళ్లుగా అడవిబిడ్డలు పడుతున్న ఈ కష్టాలను కడతేరుస్తామని హామీలిచ్చే నేతలు.. ఆ తర్వాత మరిచిపోతూనే ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా గిరిజనం బతుకు పోరాటం సాగిస్తూనే ఉన్నారు.

ఇవీ చదవండి

మన్యంలో మారని పరిస్థితులు... ఆసుపత్రికి వెళ్లాలంటే డోలీనే దిక్కు

Last Updated : Aug 12, 2020, 2:04 PM IST

ABOUT THE AUTHOR

...view details