వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రిటర్న్స్ దాఖలుకు... కేంద్రం కొత్త విధానం తీసుకొచ్చినట్లు జీఎస్టీ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ ఎన్. శ్రీనివాసరావు తెలిపారు. జనవరి నుంచి అమలయ్యే నూతన విధానంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి రిటర్న్స్ దాఖలు, ప్రతి నెలా పన్ను చెల్లింపునకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు వివరించారు. ప్రతి నెలా రిటర్న్స్ దాఖలు చేయటం వల్ల వ్యాపారులకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, ఈ వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు.
పన్ను చెల్లింపులు మాత్రం నెలనెలా చెల్లించాలన్నారు. అయితే.. ఈ విధానం తప్పనిసరి కాదని స్పష్టం చేశారు. వీటి చెల్లింపులకు ప్రతి రాష్ట్రానికి ప్రతి నెల ఒకటో తేదీ ప్రకటించగా... ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రతి నెలా 22వ తేదీలోగా చెల్లించాలన్నారు. ఈ చెల్లింపులు రెండు విధాలుగా చేసేందురు అవకాశం ఉందనీ... ఒకటి స్థిర, రెండు అంచనా విధానాలతో చెల్లింపులు జరపొచ్చునని వివరించారు.