హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో కొత్త విధానం అమల్లోకి తెచ్చారు ఏజెన్సీ నిర్వాహకులు. గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా ఉండేందుకు బుక్ చేసుకున్న వినియోగదారుడికి మాత్రమే సిలిండర్ అందేలా నూతన విధానాన్ని ప్రవేశపెట్టారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన నిర్వాహకులు ఈ నూతన విధాన వివరాలను వెల్లడించారు. గ్యాస్ వినియోగదారులు 9666023456 టోల్ ఫ్రీ ఐవీఆర్ఎస్ ఫోన్ నెంబర్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకోవాలన్నారు. దీంతో వినియోగదారుడికి ఓటిపి వస్తుందని తద్వారా ఇంటికి వచ్చే డెలివరీ బాయ్‌కి ఓటీపీ నెంబర్ చెబితే సిలిండర్ సరఫరా అయ్యేటట్టు ఆన్లైన్ నమోదవుతుందని పేర్కొన్నారు. దీని ద్వారా ప్రభుత్వం అందించే సబ్సిడీ సైతం తక్షణమే బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని వెల్లడించారు. ఈ విధానాన్ని నర్సీపట్నం డివిజన్ పరిధిలో రావికమతం, రోలుగుంట, మాకవరపాలెం, నాతవరం తదితర ప్రాంతాలకు తెలియజేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా.. పక్కా ప్రణాళిక - New rules to HP gas cylinder supply at visakha news
గ్యాస్ సిలిండర్ల సరఫరా పక్కదారి పట్టకుండా ఏజెన్సీ నిర్వాహకులు కొత్త విధానం అమలు చేస్తున్నారు. గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారుడికి ఓటీపీ వచ్చేలా చూస్తున్నారు.
హెచ్.పీ గ్యాస్ సిలిండర్ సరఫరాలో కొత్త విధానం